హైదరాబాద్ : తిరుగులేని విజేతగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ రోజు (ఆదివారం)దేశరాజధానికి ప్రయాణంకానున్నారు. కేంద్రంలో తిరిగి యూపీఏ అధికారంలోకి రావడంపై ఆయన సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి అభినందనలు తెలపనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలువురు కాంగ్రెస్ కీలకనేతలను కలవనున్నారు.భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు.