తెలంగాణపై టిడిపి పునరాలోచన

తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నష్టపోయిందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. కోస్తాలో 123 శాసనసభా స్థానాలుండగా తెలుగుదేశం పార్టీకి 36 స్థానాలు మాత్రమే వచ్చాయి. రాయలసీమలో 52 స్థానాలుండగా 16 స్థానాలు మాత్రమే తెలుగుదేశం గెలుచుకోగలిగింది.
తెలంగాణలో కూడా పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం ఉంది. తాము గెలుచునే సీట్లను కూడా మిత్రపక్షాలకు వదిలిపెట్టాల్సి వచ్చిందని, దాని వల్ల పెద్ద నష్టమే జరిగిందని అంటున్నారు. మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ సరిగా జరగకపోవడం కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications