మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ మాస్టర్ పీస్: ఇండియాలో కేవలం 25 మందికే ఛాన్స్!

ప్రముఖ ద్రిచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ ప్రియుల కోసం ఓ సరికొత్త అత్యంత విలాసవంతమైన లిమిటెడ్ ఎడిషన్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రఖ్యాత కస్టమ్ బిల్డర్ రఫ్ క్రాఫ్ట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని అత్యంత జనాదరణ పొందిన షాట్‌గన్ 650 రఫ్ క్రాఫ్ట్స్ ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక బైక్ క్యాలిబర్ రాయల్ కస్టమ్ బిల్డ్ నుంచి ప్రేరణ పొందింది. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందులో భారతీయ మార్కెట్ కోసం కేవలం 25 యూనిట్లను మాత్రమే కేటాయించారు.

ఈ ప్రత్యేక ఎడిషన్ మోటార్ సైకిల్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.5,75,000గా నిర్ణయించారు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ పోర్ట్ ఫోలియోలోనే అత్యంత ఖరీదైన బైకులలో ఒకటిగా నిలిచింది. గతేడాది జరిగిన EICMA 2025 వేదికపై ప్రదర్శించిన కాలిబర్ రాయల్ కస్టమ్ డిజైన్ ఆధారంగా ఈ ప్రత్యేక ఎడిషన్ బైకును రూపొందించారు. ఈ బైక్ గ్లాస్ జెట్ బ్లాక్, మ్యాట్ స్టెల్త్ బ్లాక్ పెయింట్, గోల్డ్ లీఫ్ స్ట్రైప్స్, క్విల్టెడ్ లెదర్ సీట్లు, గోల్డ్ ఫోర్క్ ఇన్నర్ ట్యూబ్స్ వంటి ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఇది సేకరించదగిన మాస్టర్ పీస్‌గా నిలుస్తుంది.

Royal Enfield Shotgun 650 Rough Crafts Launched Only 25 Units Available in India Full Details

జులై 30 వరకు కొనుగోలుకు అవకాశం
ఈ లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు జులై 30, 2026 సాయంత్రం 7 గంటలలోపు రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇండియాలో అమ్మకాలు జులై 30న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సేల్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్(అంటే మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే ప్రాధాన్యత) ప్రాతిరపదికన జరుగుతుంది. అంటే ఈ బైక్ ఇండియాలో 25 మంది అదృష్టవంతులు మాత్రమే పొందగలరు.

ఈ ప్రత్యేక ఎడిషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 లుక్ పరంగా భారీ మార్పులు చేసినప్పటికీ.. మెకానికల్ పరంగా స్టాండర్డ్ మోడల్ తో సమానంగా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన 648సీసీస పారలల్-ట్విన్ ఇంజిన్ ఉపయోగించారు. రఫ్ క్రాఫ్ట్స్‌కు చెందిన విన్‌స్టన్ యే రూపొందించిన ఈ ఎడిషన్‌లో దాని ప్రామాణికతను చాటిచెప్పడానికి ట్యాంక్ నంబరింగ్, ఒక ప్రత్యేకమైన ఇత్తడి బ్యాడ్జ్ ఉంటాయి. లక్కీ కొనుగోలుదారులు రఫ్ క్రాఫ్ట్స్ వ్యవస్థాపకుడు సంతకం చేసిన ఆర్ట్‌వర్క్ స్కెచ్ కూడా ఉచితంగా లభిస్తుంది. రిజిస్ట్రేషన్ తర్వాత, అమ్మకం జరిగే రోజున 'మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత' అనే ప్రాతిపదికన ఎంపిక చేసిన కొద్దిమంది మాత్రమే దీనిని ఇంటికి తీసుకెళ్లగలరు. మోటార్‌స్పోర్ట్ కళ, కస్టమైజేషన్ పట్ల మక్కువ ఉన్నవారికి ఇది ఓ గొప్ప అవకాశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q