పీఆర్పీ వల్లే ఓటమి: రోజా
తిరుపతి : ప్రజారాజ్యం వల్లే తెలుగుదేశం ఓటమి పాలయిందని తెలుగుమహిళ అధ్యక్షురాలు రోజా అభిప్రాయపడ్డారు.అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నైతిక విజయం తెలుగుదేశానిదేనని తెలుగుమహిళ అధ్యక్షురాలు రోజా అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్లనే చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశానికి నాయకత్వసమస్య ఎదురయిందని ఆమె అన్నారు. తాను ఇక ముందు కూడా నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని రోజా తెలిపారు. రోజా చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణకుమారిపై ఓడిపోయారు.












Click it and Unblock the Notifications