పటేల్ అంతిమయాత్రకు పోలీసుల అడ్డంకి
మహబూబ్ నగర్: మావోయిస్టు నేత పటేల్ సుధాకర్ రెడ్డి అంతిమ యాత్రను పోలీసులు మంగళవారం ఉదయం గద్వాలలో అడ్డుకున్నారు. సుధాకర్ రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి ప్రదర్శనగా వెళ్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుధాకర్ రెడ్డి బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు, ప్రదర్శనకారులకు మధ్య తోపులాట కూడా జరిగింది.
పటేల్ సుధాకర్ రెడ్డి అంత్యక్రియలకు ప్రజా గాయకుడు గద్దర్, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు హాజరయ్యారు. పోలీసులకు, వరవరరావుకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. పటేల్ సుధాకర్ రెడ్డి వరంగల్ జిల్లాలోని తాడ్వాయి అటవీ ప్రాంతంలో పోలీసుల చేతి హతమైన విషయం తెలిసిందే. సోమవారం రీపోస్టుమార్టం చేసిన తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications