బెర్త్ ల గొడవలు: 28న విస్తరణ

మిత్రులకు ఇచ్చే మంత్రి పదవులపై ఆ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ తమకు ఎనిమిది మంత్రి పదవులు కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి క్యాబినెట్ మంత్రి పదవి కాగా మిగతా ఏడు సహాయ మంత్రి పదవులు కావాలని ఆమె కోరుతున్నారు. ఇప్పటికే ఏడు మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెసు అంగీకరించింది.
తృణమూల్ కాంగ్రెసుతో సమస్యలు లేవని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్ పౌర విమానాల శాఖను ఇచ్చే అవకాశం ఉంది. తన సొంత పార్టీ లోకసభ సభ్యుల నుంచి కూడా కాంగ్రెసు నాయకత్వంపై ఒత్తిడి ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు మంత్రివర్గంలో ఎక్కువ కోటాను ఆశిస్తున్నాయి.












Click it and Unblock the Notifications