శోభారాణి వల్లే చిరు ఓటమి: భవాని
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అనుబంధ మహిళా సంఘం మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి వంటి వారి వల్లనే చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగా భవానీ వ్యాఖ్యానించారు. కాంగ్రెసుపై శోభారాణి చేసిన వ్యాఖ్యలను ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. శోభారాణి వంటి వారి వల్లనే ప్రజారాజ్యం పార్టీకి పలు చోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి వచ్చిందని ఆమె అన్నారు.
శోభారాణి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదని గంగా భవానీ అన్నారు. శోభారాణి మహిళా వ్యతిరేకి అని ఆమె అన్నారు. శోభారాణి వంటి వారికి చిరంజీవి పెద్ద పీట వేయడం వల్లనే పార్టీకి నష్టం జరిగిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications