జానా కోసం తెరాస తంటాలు

ప్రజారాజ్యం పార్టీ నేత టి.దేవేందర్ గౌడ్ ను తెరాస నాయకులు పార్టీలోకి అహ్వానించినట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ దేవేందర్ గౌడ్ ను కలిసి ఆహ్వానం పలికారు. అయితే దేవేందర్ గౌడ్ ఈటెల రాజేందర్ పై తీవ్రంగా మండిపడ్డారు. తాను తెలుగుదేశంలో ఉండి తెలంగాణ వాణిని వినిపించినప్పుడు తనను పావులా వాడుకున్నారని, బయటకు వచ్చిన తర్వాత స్నేహ హస్తాన్ని అందించడం మాని కెసిఆర్ నాటకాలు ఆడారని దేవేందర్ అన్నట్లు సమాచారం. తనను ఎటూ కాకుండా చేశారని ఆయన అన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ పై తనకు నమ్మకం లేదని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications