యు.ఎస్ లో మనవాడిపై మరో దాడి
తెనాలి: అమెరికాలో మన రాష్ట్ర విద్యార్థిపై నల్ల జాతీయుడి దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన కడియాల మురళీకృష్ణ (25) ఈ లసారి ఈ దారుణం జరిగింది. ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం 2007 డిసెంబర్‌లో అమెరికాలోని మిసిసిపీ వెళ్లిన మురళీ కృష్ణ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ మిసిసిపిలో ఎంఎస్ (కంప్యూటర్స్) చేస్తున్నారు.
మూడు సెమిస్టర్ల ఈ కోర్సు ఈ ఏడాదితో ముగియనుంది. ప్రస్తుతం సెలవులు కావటంతో ఓ సూపర్ మార్కెట్ లో మురళీకృష్ణ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నారు. అయితే..మే 17 రాత్రి ఆంథోనీ క్రాఫ్టర్ అనే నల్లజాతీయుడు సూపర్ మార్కెట్‌కు వచ్చాడు. బీరు కొనుగోలు చేశాడు. డబ్బు చెల్లించకుండా వెళ్లిపోతున్నాడు. దీంతో అతని కారు నెంబరును నోట్ చేసుకునేందుకు మురళీకృష్ణ ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన క్రాఫ్టర్ కారును దురుసుగా పోనిచ్చాడు. ఈ సందర్భంగా మురళీకృష్ణ కుడి చేయి కారులో ఇరుక్కుపోయింది.
అయినప్పటికీ కారుతోపాటు మురళీకృష్ణను అర కిలోమీటరు దూరం ఈడ్చుకుపోయాడు. తీవ్రంగా గాయపడిన మురళీకృష్ణను యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అలబామాలోని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే కొన్ని శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరిగాయని, మరో 4 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు మురళీకృష్ణ సోదరుడు రవికిరణ్ మీడియాకు తెలిపారు. ఈ సంఘటనపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన ఆంథోనీ క్రాఫ్టర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications