హైదరాబాద్ లో మరో స్వైన్ ఫ్లూ కేసు
హైదరాబాద్: హైదరాబాద్ ఛాతీ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థికి స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) ఉన్నట్లు బుధవారం నిర్ధరణ అయ్యింది. ఈ విద్యార్థి నుంచి సేకరించిన నమూనాలను ఢిల్లీలోని జాతీయ అంటువ్యాధుల పరీక్షా కేంద్రం, పుణెలోని మరో పరీక్షా కేంద్రానికి పంపించారు. అనంతరం అతడికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు ఆ రెండు పరీక్ష కేంద్రాలు తెలిపాయని డాక్టర్ శుభాకర్ చెప్పారు.
హైదరాబాద్ కు చెందిన ఓ వైద్య విద్యార్థి (20) నెలరోజుల క్రితం కెనడాలోని టోరెంటోలో బంధువుల ఇంటికి వెళ్లాడు. గతనెల 30న బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో లో నగరానికి చేరుకున్నాడు. మరుసటి రోజు నుంచి దగ్గు, జ్వరం, ముక్కు నుంచి నీరుకారడం తదితర లక్షణాలు కనిపించడంతో తొలుత కేర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఛాతీ వైద్యశాలకు వెళ్లాడు. గతనెల 13న అరబ్ ఎమిరేట్స్ విమానంలో వచ్చిన 23 ఏళ్ల హైదరాబాద్ యువకుడికి కూడా స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. కోయంబత్తూరులో తల్లీ, కొడుకులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో దేశంలో స్వైన్ ఫ్లూ సోకినవారి సంఖ్య నాలుగుకి చేరుకుంది.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications