దాడులు తగ్గాయి: ఆసీస్ హైకమిషనర్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై దాడులు తగ్గుతున్నాయని భారత్ లో ఆస్ట్రేలియా హై కమిషనర్ జాన్ మెకర్తీ శుక్రవారం అన్నారు. పరిస్థితి మెరుగు పడుతోందని కమిషనర్ అన్నారు. జాతి వివక్ష దాడులు తగ్గుతున్నాయని చెప్పారు. తాజాగా అడిలైడ్ లో మరో భారత విద్యార్థిపై దాడి జరిగిన నేపథ్యంలోనే హై కమిషనర్ ప్రకటన వెలువడింది.
ఇప్పటి వరకు భారతీయ విద్యార్థులపై ఆస్ట్రేలియాలో 11 దాడులు జరిగాయి. సిడ్నీ, మెల్బోర్న్ ల్లోని భారత విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. భూస్వాములు, ఉద్యోగ దాతలు, శిక్షణ సంస్థలు చేస్తున్న దోపిడీపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications