మొద్దు శీను ఫేం ఓంప్రకాష్ విషమం
హైదరాబాద్: మొద్దు శ్రీను హత్యకేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఓంప్రకాశ్(42) ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శనివారం కూడా అతనికి కృత్రిమ శ్యాస అందించామని, ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించటం లేదని ఓ వైద్యుడు తెలిపారు. నాలుగు రోజుల క్రితం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఎస్కార్టు పోలీసులు ఓంప్రకాశ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించిన విషయం విదితమే. అతనికి జనరల్ మెడిసిన్ విభాగం వైద్యులు డాక్టర్ సంతోషకుమారి, డాక్టర్ వసంత్‌ప్రసాద్, నెఫ్రాలజీ విభాగం అసోసియేట్ ఫ్రొఫెసర్ డాక్టర్ మనీషా సహాయ్‌లు వైద్య సేవలు అందిస్తున్నారు. బీపీ తక్కువగా ఉండటం, రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఓంప్రకాశ్‌కు పెరిటోరియల్ డయాలసిస్ చేస్తున్నామని సంతోషకుమారి తెలిపారు. పరిస్థితి మెరుగైన తర్వాత హీమో డయాలసిస్ చేస్తామని వివరించారు.












Click it and Unblock the Notifications