తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదివారం రాత్రి తిరుమలలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుమలలోని సన్నిధానం, పాంచజన్యం అతిథిగృహాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్లను పిలిపించి ప్రాథమిక వైద్యం అందించారు. అక్కడ్నుంచి ఆయన పద్మావతి అతిథిగృహం వద్దకు చేరుకున్నారు. రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోలేదు. పండ్లరసం సేవించి అతిథిగృహంలోనే విశ్రాంతి తీసుకున్నారు.