సామాన్య భక్తులకు ప్రాధాన్యం: వైఎస్
తిరుపతి: తిరుమలలో స్వామివారి దర్శనానికి వీఐపిలకు కాకుండా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఉదయం శ్రీవెంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రిని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వీఐపిల కోసం కాకుండా మీరు సామాన్య భక్తుల కోసం పని చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. మంత్రులు గల్లా అరుణ, గాదె వెంకట రెడ్డి, తిరుపల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆదికేశవులు నాయుడు, మాజీ చైర్మన్ కరుణాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications