కెసీఆర్ ను చంపినా..కుక్కను చంపినా
హైదరాబాద్: తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పై అసమ్మతి నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను చంపినా, కుక్కను చంపినా ఒకటే అని మాజీ మంత్రి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. చంద్రశేఖర్ నివాసంలో అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు. గుండాలను తీసుకువచ్చి పార్టీ కార్యవర్గ సమావేశం నడిపించారని చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన రవీంద్రనాయక్ పై వారితో దాడి చేయించారన్నారు. మరోసారి నేతలంతా భేటీ అయి భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తామని తెలిపారు. కేసీఆర్ తో పాటు తెలంగాణ ద్రోహులను ఎన్ కౌంటర్ చేయాలని మరో అసమ్మతి నేత శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications