మహిళా కళాశాలకు బాంబు బెదిరింపు
హైదరాబాద్: హైదరాబాద్ లో గల మలక్ పేటలోని వాణి మహిళా కళాశాలలో సోమవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. స్థానిక శ్రీవాణి మహిళా కళాశాలలో బాంబు ఉన్నట్లు ఫోన్ కాల్ రావటంతో యాజమాన్యం పోలీసులకు తెలిపింది. వారు విద్యార్థినులను బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపుతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.












Click it and Unblock the Notifications