హైదరాబాద్: తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకుంటే వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వెల్లడించారు. ఆగస్టులో పార్టీ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. రైలింజన్ గుర్తు మార్చుకునేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.
తమ పరిశీలనలో నాలుగైదు గుర్తులున్నాయని, గ్రేటర్ ఎన్నికల నాటికి గుర్తు ఖరారు చేస్తామని ప్రకటించారు. పార్టీని సీనియర్లు వదిలి వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదని, తాను లేకపోయినా పార్టీ నడుస్తుందని స్పష్టం చేశారు.