Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ గూటికి తలసాని?

Talasani Srinivas Yadav
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ కాంగ్రెస్‌ లో చేరతారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో అధికారపార్టీ తరఫున తలసానే మేయర్‌ అభ్యర్థి అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించడానికి తలసాని సమాయత్తమవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ వాదానికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామన్న పార్టీ అధిష్ఠానం ప్రకటనను తలసాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేకవాదంతో ఇటీవలి ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయామని, ఇంకా దాన్నే పట్టుకొని వేలాడడం సరికాదని ఆయన భావిస్తున్నారు.

సమైక్యవాదంతోనే తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉంటుందని గట్టిగా వాదిస్తున్నారు. సమైక్యవాదానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో పార్టీనుంచి వైదొలగాలని తలసాని కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. దీనిపై సికింద్రాబాద్‌, సనత్‌ నగర్‌ నియోజకవర్గాల పరిధిలోని తన అనుచరులతో ఆయన బుధవారం నగర శివార్లలోని శామీర్‌పేట ఫామ్‌ హౌస్‌ లో విందు సమావేశం నిర్వహించారు. ఇటీవలి ఎన్నికల్లో తనతోపాటు నగరం, శివారు ప్రాంతాల్లో తెదేపా అభ్యర్థులు ఓడిపోవడానికి పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయమే కారణమని ఆయన విమర్శించారు. ఇదే నినాదంతో గ్రేటర్‌ ఎన్నికలకు వెళితే మళ్ళీ అవే ఫలితాలు పునరావృతం అవుతాయని చెప్పారు. ఇకనైనా పార్టీ సమైక్యవాదాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందని సమావేశంలో స్పష్టం చేశారు. అదే జరగని పక్షంలో తాను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి తనతో కలసి రావాలని అనుచరులను కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+