ఎమ్మెల్యే రామారావు నిరవధిక దీక్ష
హైదరాబాద్: తనపై బనాయించిన అక్రమ కేసును ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు హైదరాబాదులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. టీవీ రామారావు తాను నడుపుతున్న కళాశాలలో ఒక విద్యార్థిపై అత్యాచారం జరిపి ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతు తెలపడానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వచ్చారు.
రామారావుపై కేసు పెట్టి దాన్ని సిబిసిఐడికి అప్పగించడం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నిరంకుశత్వానికి తార్కాణమని తెలుగుదేశం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళిత శాసనసభ్యుడికే దిక్కు లేని పాలన రాష్ట్రంలో సాగుతోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. హత్య జరినట్లు దాఖలాలు లేవని ఎస్పీ, కలెక్టర్ చెప్పినా ఆ కేసును సిబిసిఐడికి అప్పగించడం రామారావును వేధించడానికేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications