చాముండిపై మరో కేసు నమోదు
గుంటూరు: ఆంధ్రా క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి మరిన్ని చిక్కుల్లో పడుతున్నారు. ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. క్రికెట్ నిబంధనలను ఏకపక్షంగా మార్చారంటూ ఆంధ్రా క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావు బుధవారం గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చాముండేశ్వరీనాథ్ ఇప్పటికే అవినీతి, లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ మహిళా క్రికెటర్లు చాముండేశ్వరీ నాథ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారని కూడా వారు ఆరోపించారు.












Click it and Unblock the Notifications