సినిమాల్లో నటించను: చిరు

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమాలో నటించబోతున్నారా అని ప్రశ్నించగా అలాంటి ప్రస్తావనే లేదని చెప్పారు. 'రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల గురించి ఆలోచించటంలేదు. గతంలో ఒక సినిమాకి క్లాప్ కొట్టేందుకు, తాజాగా ఆడియో ఫంక్షన్‌కి వెళ్లాను. అక్కడ అందరూ ఇంకొక సినిమాలో నటిస్తే బాగుంటుందని సూచించారు. జోడు గుర్రాల స్వారీ చేయలేనని అక్కడే చెప్పాను. భవిష్యత్తులో ఎలాగుంటుందో చెప్పలేనన్నాను. సినీరంగం పుట్టినిల్లు అయితే రాజకీయరంగం మెట్టినిల్లు. పుట్టినిల్లు ఎంతగా నచ్చినా ఆడపిల్ల మెట్టినింటికి వెళ్లాక భర్తను వదిలి పుట్టింటికి వెళ్లలేదు కదా! సినీరంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చినందుకు విచారమేమీ లేదు. ప్రస్తుతం నా దృష్టంతా రాజకీయాలపైనే. పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయటానికే కృషి చేస్తాను. అదే నా లక్ష్యం. గమ్యం. ఇలాకాకుండా అంతా కోరుకుంటున్నారని సినీ రంగంలోకి వెళ్లటం ధర్మం కాదు' అని వివరించారు.
ఎన్నికల గుర్తుగా నాలుగింటిని తుదిపరిశీలనకు తీసుకున్నామని, వీటిలో సూర్యుడు గుర్తుపై తనతోపాటు ఎక్కువమంది నాయకులు మొగ్గుచూపారని చిరంజీవి తెలిపారు. అందరికీ సులువుగా అర్థమయ్యేలా ఉన్న గొడుగు కూడా బాగుందని, ఈ రెండింటిలో ఏదోఒకటి నిర్ణయించుకుంటామని వెల్లడించారు. సీనియర్ నేత శివశంకర్ ప్రత్యేక ఆహ్వానితునిగా సలహాలు ఇచ్చేవారని, ఇప్పుడైనా సలహాలు అడిగితే ఆయన వస్తారనే భావిస్తున్నానని తెలిపారు. ఆయన అసలు ప్రజారాజ్యం సభ్యత్వమే తీసుకోలేదట కదా అని ప్రస్తావించగా ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించాం అంటే అర్థమేమిటని ఎదురుప్రశ్నించారు.
యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పూర్తిచేయాల్సిన సినిమాలు ఉన్నందున ప్రస్తుతం ఆపనిలో ఉన్నారని, పార్టీకి అవసరమైనప్పుడు వస్తారని చిరంజీవి వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశముందని అన్నారు. జులై ఆరో తేదీ నుంచి జిల్లాలకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించినా, జిల్లా పరిశీలకులు వెళ్లివచ్చాక పర్యటించాలని భావిస్తుండటంతో ఇంకా తేదీలు ఖరారు చేయలేదని తెలిపారు.
తెదేపా, భాజపాలతో కలవం. తెదేపా, భాజపాలతో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోమని చిరంజీవి స్పష్టం చేశారు. తెదేపాతోపాటు ప్రరాపాతోనూ కలవాలన్న సీపీఐ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని కొట్టిపడేశారు. లోక్‌సత్తా పార్టీ నేతలతో మాట్లాడలేదని, వారితో కలవటానికి అభ్యంతరం ఏమీలేదని పేర్కొన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు నేరం చేశారనటానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏమీలేనందున బేషజాలకు పోకుండా కేసు తొలగించాలని సూచించారు. ఎమ్మెల్యే చేస్తున్న దీక్షకు మద్దతుగా మహిళారాజ్యం నేత శోభారాణి వెళ్లటం ఆమె వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి, తిరుపతి తదితరచోట్ల ప్రరాపా నేతల్ని వేధిస్తున్నారని, వారి వ్యాపారాలకు ఆటంకం కల్పిస్తున్నారని చిరంజీవి ఆరోపించారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులు వేధిస్తున్నారని, కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి గాని ఇలా చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరుగుతోందని తాను భావించటంలేదని వ్యాఖ్యానించారు.
-
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications