ఆర్టీసీ ఛార్జీలు పెంచం: శత్రుచర్ల
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం లేదని రవాణ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంత్రి గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పెరిగన ధరలతో ఆర్టీసీపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ ప్రయాణికులపై అదనపు భారాన్ని వెయ్యబోమని తెలిపారు.
డీజిల్ ధర పెరగడంతో రవాణా చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ స్థితిలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు చార్జీలను పెంచవచ్చుననే ఊహాగానాలు చెలరేగాయి. మంత్రి ప్రకటనతో ఆ ఊహాగానాలకు తెర పడింది.












Click it and Unblock the Notifications