యూత్ కాంగ్రెస్ నేత దారుణహత్య
హైదరాబాద్: హైదరాబాదులోని లంగర్ హౌజ్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ నాయుడు బుధవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీధర్ నాయుడు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇదే సమయంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బుధవారం ఉదయం స్థానికంగా ఉండే రమేష్ అనే వ్యక్తికి శ్రీధర్ కి మధ్య గొడవ జరిగింది. పోలీసులు వీరి మధ్య రాజీ కుదిర్చి ఇంటికి పంపించారు.
అయితే రాత్రి బైక్ పై వెళ్తున్న శ్రీధర్ పై రమేష్ కొడుకు, అతని స్నేహితులు కర్రలతో దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు గొల్కొండ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications