ఎమ్మెల్యేపై వైయస్ కు ఫిర్యాదు

ఇదిలా ఉంటే, తీవ్రవాద నిర్మూలన కమిటీ ఆక్టోపస్ విధి విధానాలపై ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆక్టోపస్‌ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆక్టోపస్ శిక్షణకు, భవన సముదాయం సమకూర్చుకునేందుకు 60 నుంచి 90 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈనెల 14వ తేదీలోగా ప్రణాళిక రూపొందించి తదుపరి సమీక్షలో సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications