ఇండియన్స్ దాడి ఉత్తదే: భారత్
న్యూఢిల్లీ: ఆఫ్గనిస్థాన్ లో భారతీయులపై దాడి జరిగిందని పాక్ మీడియాలో వచ్చిన కథనాలను భారత విదేశాంగశాఖ ఖండించింది. భారతీయులపై ఎటువంటి దాడులు జరగలేదని తెలిపింది. ఆఫ్గన్ లో ఓ నిర్మాణసంస్థలో పనిచేస్తున్న భారతీయులపై తాలిబాన్లు దాడి జరపడంతో ఆరుగురు చనిపోయినట్లు పాకిస్తాన్ కు చెందిన ఒక చానెల్ వార్తను ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
అఫ్గానిస్తాన్ లో ఏ విధమైన దాడిలోనూ భారతీయులెవరూ మరణించలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. తాము పరిశీలిస్తే పాకిస్తాన్ మీడియా ప్రసారం చేసిన వార్త తప్పని తేలిందని అన్నది. అఫ్గానిస్తాన్ లో తాలిబాన్లు జరిపిన దాడిలో ఆరుగురు భారతీయులతో పాటు 18 మరణించినట్లు డాన్ న్యూస్ చానెల్ వార్తను ప్రసారం చేసింది.












Click it and Unblock the Notifications