లారీ,బస్సు ఢీ..10మంది మృతి
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలొని పెద్ద కందుకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 20 మందికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది. మృతుల్లో ట్రైనీ డీఎస్‌పీ గిరిధర్, కడపజిల్లా రామాపురు మాజీ ఎంపీటీసీ ప్రభాకరరెడ్డితో, ఓ బీటెక్ విద్యార్థి కూడా వున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా వుండటంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన బస్సు శివసాయి ట్రావెల్‌కు చెందినట్లు తెలిసింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మందిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications