ఈవీఎం ప్రోగ్రామర్స్ ఎవరు?: బాబు

ఓటింగ్‌లో అవకతవకలకు ఏమాత్రం అవకాశం లేని పద్ధతిని అనుసరించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కచ్చితంగా ఉపయోగించుకోవాలని, కానీ అది ప్రజాస్వామ్యంపైనే అనుమానాలకు తావిచ్చేదిగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. అలాగే సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా, సింగపూర్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ తదితర దేశాలు బ్యాలెట్ పద్ధతినే ఉపయోగిస్తున్నారని చెప్పారు.
ఆ విషయం ప్రస్ధావిస్తూ ''గతంలో ఓసారి సింగపూర్ ప్రధాని నాతో మాట్లాడుతూ.. 'మేం ప్రతి రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. ఒక్క ఎన్నికల విషయంలో తప్ప. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించింది. ఏదైనా ప్రోగ్రామింగ్ తేడాలు జరిగితే ఎవరు ఎవరికి ఓటేశారనేది తెలియదు. అందుకే ప్రజాస్వామ్యయుతంగా కాగితపు బ్యాలెట్ వాడుతున్నాం' అని చెప్పారు.
అంతేగాక ఈవీఎంలో పార్టీ గుర్తుకు ఎదురుగా ఉన్న మీట నొక్కగానే బీప్ అనే శబ్దం వస్తుంది. అయితే అది అనుకున్న పార్టీకి ఓటేశామనే భావన తప్ప, ఎవరికి పడిందో ఓటరుకు తెలియదు. ఇలా కాకుండా ఓటరు సంతృప్తి చెందే పద్ధతి ఉండడం మేలు''అనిఅన్నారు. ఈవీఎంలలో ఓట్లు తారుమారయ్యే అవకాశముందని జనవిజ్ఞాన వేదిక ఇప్పటికే నిరూపించిందని ఆయన గుర్తు చేసారు.












Click it and Unblock the Notifications