డబ్బిస్తామన్న వారితో కేసీఆర్ ...
హైదరాబాద్: పొత్తుల కోసం తెదేపా, ప్రరాపాలతో చర్చలు జరిపి ఎక్కువ డబ్బిస్తామన్న వారితో అంగీకారం కుదుర్చుకున్నారని జిట్టా బాలకృష్ణరెడ్డి విమర్శించారు.తెరాస అధినేతపై అసమ్మతి గళం వినిపించి పార్టీ నుంచి సస్పెండైన జిట్టా బాలకృష్ణరెడ్డి మరోసారి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన కేసీఆర్ తిథులు, ముహుర్తాల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రజల సమస్యల్ని, ఆకాంక్షల్ని విస్మరించారని దుయ్యబట్టారు. చంద్రశేఖర్, రవీంద్రనాయక్ వంటి నేతల్ని ఆర్థిక ప్రలోభాలు చూపి తిరిగి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ప్రజల్లో విశ్వాసం కల్గించలేకే ఎన్నికల్లో ఓడిన విషయాన్ని ఒప్పుకోకుండా ఇతర పార్టీలపై నెట్టివేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న అధినేత వైఖరికి నిరసనగా తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిట్టా పాటు నల్గొండ జిల్లా నేతలు కొందరు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications