ఫ్లైఓవర్ కూలి ఐదుగురు మృతి
న్యూఢిల్లీ : నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ కూలిపోవడంతో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో ఇరవై మంది గాయపడ్డారు. దక్షిణ ఢిల్లీ లజపత్ నగర్ సమీపంలో ఈ దుర్ఘటన ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో జరిగింది. గాయపడిన వారిని ఎయిమ్స ఆసుపత్రికి తరలించారు. బ్రిడ్జ్ కూలిపోయే సమయంలో దాదాపు 50 మంది కూలీలు ఉన్నారని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అగ్నిమాపక దళాలు, పోలీసులు శిథిలాలను తొలగించడానికి కృషి చేస్తున్నారు.దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు రైల్వే మెట్రో అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications