హైదరాబాద్: రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉన్నా మంత్రుల వైభోగాలు తగ్గడం లేదు. ఇంట్లో, ఆఫీసులో కప్పులు, సాసర్లు తదితర క్రాకరీ వస్తువులకు ఎవరైనా లక్ష్ఠన్నర రూపాయలు ఖర్చు పెడతారా?. కచ్చి తంగా 'నో' అనేదే జవాబు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ తో కలుపుకొని మొత్తం 36 మంది మంత్రుల తేనీటి సా మగ్రికి రాష్ట్ర ప్రభుత్వం రూ.54 లక్షలు విడుదల చేసింది. మంత్రికి లక్షన్నర చొప్పు న కేటాయి స్తూ, సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేటాయింపులు చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు.