లక్నో: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రీటా బహుగుణకు బెయిలు మంజూరైంది. మాయావతిపై వివాదాసప్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమె బెయిలు కోరుతూ మొరాదాబాద్ కోర్టులో పిటీషన్ వేశారు. ఈరోజు ఆమె పిటీషన్‌ను విచారించిన కోర్టు ఎట్టకేలకు బెయిలు మంజూరుచేసింది. 30 వేల రూపాయల పూచీకత్తుపై ఈనెల 29 వరకు ఆమెకు బెయిలు మంజూరు చేశారు.