రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్ పై వెళుతుండగా హతుడిని కొందరు దుండగులు వెంటాడి చంపారు. అతికిరాతకంగా రాళ్లతో మోది హత్య చేశారు. ఈ ఘటన మలక్ పేటలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తిని రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజుగా పోలీసులు గుర్తించారు. హతుడు సరూర్ నగర్ వాసని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications