విద్యార్థినిపై కీచక టీచర్ అత్యాచారం
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్ లో ఓ కిరాతక ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి విద్యార్థినిపై రామాంజనేయులు అనే ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు గుంతకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బాలికను నగ్నంగా అతను వీడియోలో చిత్రీకరించాడని కూడా వారు ఆరోపించారు. స్లిప్ టెస్టులో మార్కులు వేస్తానని చెప్పి అతను ఈ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
రామాంజనేయులు ఉదంతం నాలుగు రోజుల క్రితమే జరిగింది. అయితే అది మంగళవారం వెలుగు చూసింది. రామాంజనేయులు వ్యవహారంపై విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం వారు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications