బడ్జెట్ పై బాబు రుసరుసలు
హైదరాబాద్: 2009-10 సంవత్సరానికి గానూ ఆర్థిక మంత్రి రోశయ్య ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై శుక్రవారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రుసరుసలాడారు. ఓ పద్దతి పాడు లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, ఆర్థిక మాంద్య నివారణ, ఐటి బాధితుల గోడును పట్టించుకోకపోవడమే గాకుండా పలు రంగాలకు నిధుల కేటాయింపుల్లో కోత పెట్టడాన్ని బాబు తప్పుబట్టారు.
రైతుబజార్లు, మార్కెటింగ్ యార్డుల స్థిరీకరణ గురించి పట్టించుకోకుండా సహకార సేద్యం పేరుతో మరో అవినీతి భాగోతానికి తెరతీశారని బాబు ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్‌లో ఏ రంగానికీ తగిన ప్రాధాన్యం లేకపోవడం సర్కారు డొల్లతనానికి నిదర్శనమన్నారు.












Click it and Unblock the Notifications