భూసేకరణపై మమత లేదు
న్యూఢిల్లీ: పరిశ్రమలకోసం ప్రభుత్వాలు చేపట్టే భూసేకరణను తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి అనుకూలంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లును కూడా ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. గత రాత్రి న్యూఢిల్లీలో క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ 2007, రీహాబిలిటేషన్, రీసెటిల్‌మెంట్ బిల్లులలో సవరణలు చేసేందుకు చర్చ జరిగింది. ప్రైవేటు వ్యక్తులు పరిశ్రమలకోసం 70 శాతం భూమిని స్థానిక రైతులనుంచి సేకరించేందుకు వీలు కల్పించాలని సవరణ ప్రతిపాదించారు దీన్ని మమతాబెనర్జీ వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications