అసెంబ్లీకి టిడిపి ఎమ్మెల్యేల పాదయాత్ర
హైదరాబాద్: శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా తెలుగుదదేశం శాసనసభ్యులు శుక్రవారం ఎన్టీఆర్‌ఘాట్‌నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు బతకటమే కష్టంగా మారిందని, అందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామని టీడీపీ నేతలు తెలిపారు.
ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ఘాట్ వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ్యులతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. శుక్రవారం ఉదయం స్పీకర్ ఇచ్చిన అల్పాహార విందుకు తెలుగుదేశం శాసనసభ్యులు హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications