తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. గంటల వ్యవధిలో జంట హత్యలు జరిగాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం ఉదయం తెదేపా నేత, హుసేనాపురం మాజీ సర్పంచి, కాకర్ల రంగయ్యను తాడిపత్రి విజయబార్ సమీపంలో ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.
ఈ ఘటన జరిగి మూడు గంటలు గడవక ముందే కాంగ్రెస్ నేత ఓబుల్‌రెడ్డిని ప్రత్యర్థులు నరికిచంపారు. తాడిపత్రి మెయిన్‌రోడ్డులో ఆయనపై మారణాయుధాలతో దుండగులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఓబుల్‌రెడ్డి పుట్లూరు మండలం చాలమేముల మాజీ సర్పంచి. దీంతో పోలీసులు తాడిపత్రిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications