పాతకక్షలు: ఇద్దరి దారుణ హత్య
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం పాతకక్షలు పడగ విప్పాయి. ఇద్దరు నాయకులు వేర్వేరుగా దారుణ హత్యకు గురయ్యారు. తాడిపత్రి మండలం హుసేనాపురం మాజీ సర్పంచి, తెలుగుదేశం నేత కాకర్ల రంగయ్య హత్యకు గురయ్యారు. ఆయన్ను ఈ ఉదయం తాడిపత్రి విజయబార్ సమీపంలో ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగయ్య ఇటీవలే కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరారు.
మరో సంఘటనలో తాడిపత్రిలో కాంగ్రెస్ నేత ఓబుల్‌రెడ్డిని ప్రత్యర్థులు నరికిచంపారు. తాడిపత్రి మెయిన్‌రోడ్డులో ఆయనపై మారణాయుధాలతో దుండగులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఓబుల్‌రెడ్డి పుట్లూరు మండలం చాలమేముల మాజీ సర్పంచి. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అనుచరుడు.












Click it and Unblock the Notifications