జనచైతన్య వేదికకు ఈసీ పిలువు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌ల (ఇవియంల) వాడకంపై అనుమానాలను లేవనెత్తుతున్న 'జనచైతన్య వేదిక'కు కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. ఆ సంస్థ లెవనెత్తుతున్న సాంకేతిక అంశాలపై ప్రదర్శన ఇవ్వాలని కోరుతూ ఈసీ లేఖ రాసింది. ఈవీఎంల వినియోగంపై జనచైతన్య వేదిక వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా ఈసీ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇసి నుంచి జన చైతన్య వేదికకు ఆహ్వానం అందింది.
br /> ఇవియంల ద్వారా ఎన్నికల్లో జరిగే అవకాశం ఉందని జన చైతన్య వేదిక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇవియంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఎలా వుందో తెలియజేయడానికి జన చైతన్య వేదిక ప్రయోగాత్మకంగా ఈ మధ్య కాలంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రదర్శన ఇచ్చింది. ఆ అనుమానాలనే లేవనెత్తుతూ జన చైతన్య వేదిక సుప్రీంకోర్టుకు వెళ్లింది.












Click it and Unblock the Notifications