ఇవియంలపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఇవియంల) వాడకాన్ని సవాల్ చేస్తూ జన చైతన్య వేదిక వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇవియంల ద్వారా అవకతవకలు జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ వేదిక సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇవియంల వాడకంపై అనుమానాలుంటే వాటిని ఎన్నికల సంఘం (ఇసి) ద్వారానే నివృత్తి చేసుకోవాలని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది.
తాము ఇదివరకే ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలను తెలియజేశామని, ఇసి పట్టించుకోలేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. మరోసారి ఇసి వద్దకు వెళ్లాలని, అప్పుడు కూడా ఇసి అనుమానాలను నివృత్తి చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సుప్రీంకోర్టుకు సూచించింది. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి గల సంస్థ అని, అనుమానాలను దాని వద్దనే నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications