ఇద్దరు టిడిపి కార్యకర్తల హత్య
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఫాక్షన్ కక్షలు పడగ విప్పాయి. ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెసు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన జిల్లాలోని గురజాల మండలం దైద గ్రామంలో జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు హన్మంతు, అమరయ్యలను కాళ్లను కాంగ్రెసు కార్యకర్తలు వేటకొడవళ్లతో నరికారు. దీంతో వారిద్దరు మృతి చెందారు. నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications