అసెంబ్లీ: ప్రతిపక్షాల వాకౌట్

ఆర్టీసిపై ఎవరికి ప్రేమ ఉందో సిబ్బందిని అడిగితే చెప్తారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. పన్నులు తగ్గించి తాము ఆర్టీసి బతికించామని ఆయన అన్నారు. 12 శాతం వంటగ్యాస్ పన్నును నాలుగు శాతానికి తగ్గించామని ఆయన చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం మూతపడే పరిస్థితి వచ్చిందని,అందుకే ఏవియేషన్ ఫ్యూయెల్ పై పన్ను తగ్గించామని ఆయన వివరణ ఇచ్చారు. ఆర్టీసికి పూర్తి సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వ తమదేనని ఆయన అన్నారు. తాము ఆదుకోకపోతే ఆర్టీసి టైర్లు, ట్యూబులు కూడా అమ్ముకునే వారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications