హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ రెడ్డిపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సీరియస్ అయ్యారు. మున్సిపాలిటీల్లో సిఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటుపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి గైర్హాజరు కావడంతో దినేష్ రెడ్డిపై ఆయన మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. దినేష్ రెడ్డి ఎవరిని అడిగి సమావేశానికి గైర్హాజరయ్యారని ఆయన ప్రశ్నించారు. దినేష్ రెడ్డి బాధ్యతారహితంగా వ్యవహరించారని అంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డిని ఆదేశించారు.