అసెంబ్లీ: రోశయ్య వ్యాఖ్యలపై రభస

రోశయ్య వ్యాఖ్యలపై చర్యకు తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టడంతో తాను రికార్డులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయినా వారు వినలేదు. మంత్రి రోశయ్య సభలో ఉన్న సమయంలో మాట్లాడేందుకు గాలి ముద్దు కృష్ణమ నాయుడికి అవకాశం ఇస్తానని కూడా ఆయన చెప్పారు. తాను ఎంతగా చెప్పినప్పటికీ తెలుగుదేశం సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై రోశయ్య మంగళవారం శాసనసభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నువ్వు మొగాడివా, సిగ్గూశరం ఉందా అంటూ రోశయ్య గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై ఆయన విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications