హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీకర్ పై చంద్రబాబు గరం

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. తమ పార్టీ శాసనసభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి రోశయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను తెలుగుదేశం సభ్యులు స్తంభింపజేశారు. సభను స్పీకర్ అర్థాంతరంగా వాయిదా వేసిన అనంతరం చంద్రబాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలను అణచివేయడానికి స్పీకర్ కొత్త కొత్త ఆంక్షలు పెడుతున్నారని, సభలో తానే సుప్రీం అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. సభ సంప్రదాయాల ప్రకారం నడవాల్సిందేనని ఆయన అన్నారు. ప్రత్యక్ష ప్రసారాలను, మీడియాను స్పీకర్ నియంత్రించడం సరి కాదని ఆయన అన్నారు. తాము 48 మంది సభ్యులున్నప్పుడే తమ హక్కులను కాపాడుకున్నామని, ఇప్పుడు కూడా కాపాడుకుంటామని ఆయన చెప్పారు. స్పీకరే రెచ్చగొట్టేలా వ్యవహరించడమేమిటని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ వ్యవహార శైలికి, రోశయ్య వ్యవహారానికి పరిష్కారం లభించాల్సిందేనని ఆయన అన్నారు.

కాంగ్రెసు ప్రభుత్వం నియంతలా ప్రవర్తిసోందని, ఎమర్జెన్సీని తలపిస్తోందని చంద్రబాబు విమర్శించారు. తమపై సభ వెలుపల, బయటా అణచివేత చర్యలకు దిగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆయన అన్నారు. తమను రెచ్చగొట్టే ధోరణిలో ప్రభుత్వమే వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సీనియర్ మంత్రి రోశయ్య మాట్లాడిన తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రెఫరెండమంటూ తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, తాను మామూలుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రెచ్చగొట్టేలా వ్యవహరించారని, తాను రెఫరెండానికి సిద్ధపడినా ముఖ్యమంత్రి వెనక్కి వెళ్లారని ఆయన అన్నారు. రాష్ట్రమంతా రెఫరెండం పెడితే తాను సిద్ధంగానే ఉన్నానని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు ప్రయోజనాలను కాపాడలేకపోయిన ప్రభుత్వం చర్చకు కూడా అనుమతించడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ధోరణిని తాము ఎదుర్కుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X