Tamil Nadu: సగం ఓట్లు కూడా తెచ్చుకోని 220 ఎమ్మెల్యేలు-ఏడీఆర్ షాకింగ్ రిపోర్ట్..!

తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో దాదాపు హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అతి పెద్ద పార్టీగా విజయ్ టీవీకే అవతరించినా, 106 సీట్లు కైవసం చేసుకున్నా భారీ మెజార్టీలు మాత్రం లభించలేదు. అలాగే విపక్షానికే పరిమితమైన డీఎంకే, అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేల పరిస్ధితి కూడా ఇదే. అంటే ముక్కోణపు పోరులో అందరూ నష్టపోయారన్న మాట. ఇదే విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక గణాంకాలతో సహా బయటపెట్టింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 220 మంది అభ్యర్థులకు 50% కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఇది ఎన్నికల సరళిలో వస్తున్న మార్పులను సూచిస్తోంది. ఓట్ల శాతం, గెలుపు తేడాల్ని విశ్లేషించిన ఈ నివేదిక ప్రకారం గెలిచిన అభ్యర్థులు సగటున కేవలం 38.99% ఓట్లు మాత్రమే పొందారు. 2021 ఎన్నికలతో పోలిస్తే ఇది గణనీయంగా తక్కువ. అప్పుడు విజేతలు సగటున 48.37% ఓట్లు దక్కించుకున్నారు. ఇది తగ్గుముఖం పట్టిన ఓటింగ్ శాతాన్ని స్పష్టం చేస్తోంది.

ADR Report 220 Tamil Nadu MLAs Won With Less Than 50 Votes in Their Constituencies

తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం 14 మంది అభ్యర్థులు మాత్రమే 50% లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించారు. వెయ్యి లోపు ఓట్ల తేడాతో గెలిచిన వారు మొత్తం 15 మంది ఉన్నారు. అదే సమయంలో, 8 మంది విజేతలు 25% కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ గణాంకాలు కొన్ని చోట్ల తీవ్రమైన పోటీ జరిగిందని సూచిస్తున్నాయి. మహిళా విజేతల విషయానికి వస్తే, మొత్తం 23 మంది మహిళా అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో 32% అంతకంటే ఎక్కువ ఓట్ల శాతంతో గెలుపొందారు. మహిళా విజేతలలో, తిరుప్పూర్ (నార్త్) నియోజకవర్గం నుండి టీవీకే పార్టీకి చెందిన వి.సత్యభామ 49.88% అత్యధిక ఓట్ల శాతంతో గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+