'పెద్ది' ఇన్ సైడ్ రిపోర్ట్: బుచ్చిబాబు తీసినట్టు లేదు.. రాజమౌళి తీసినట్టు ఉంది..!

మెగా పవర్ స్టార్​ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌ లో వస్తున్న సినిమా 'పెద్ది'. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుంది. తాజాగా విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సంక్రాంతి సినిమాల తర్వాత సమ్మర్ లో థియేటర్లు వెలవెలబోయాయి. పెద్ద హీరోల సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా విడుదల కాలేదు. దాంతో ఇప్పుడు అందరి ఆశలు పెద్ది సినిమాపైనే ఉన్నాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ తో థియేటర్లు మళ్లీ కళకళలాడతాయని అంతా భావిస్తున్నారు. ఇక ఇప్పటికే పెద్ది మూవీ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 9 నిమిషాలుగా ఉంది.

ఇక జూన్ 3న రాత్రి 8 గంటల నుంచే ఏపీలో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. ప్రీమియర్ షో టికెట్ ధరలను ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే తెలంగాణలో మాత్రం ఇంకా పెద్ది సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదు. ప్రీమియర్ షోలు కూడా లేవు. తెలంగాణలో యథావిధిగా జూన్ 4 ఉదయం నుంచి షోలు ప్రారంభం కానున్నాయి. అయితే పెద్ది సినిమాకు సంబంధించి ఇన్ సైడ్ టాక్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పెద్ది సినిమా ఫస్టాఫ్ చాలా బాగా ఉందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో వచ్చే సాంగ్స్, రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతిబాబు నటన అలరిస్తాయి. అలాగే క్రికెట్ యాక్షన్ సీన్స్ ఫస్టాఫ్ కే హైలెట్ అని సమాచారం. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా దర్శకుడు బుచ్చిబాబు డిజైన్ చేసినట్లు సమాచారం. అయితే సెకండాఫ్ స్టోరీ విజయనగరం నుంచి దిల్లీకి చేరుకుంటుంది. అక్కడి నుంచి కథనం కాస్త నెమ్మదిగా సాగుతుందని తెలుస్తోంది.

RamCharan Upcoming Film peddi First Half Superb Second Half Slightly Slow Inside Report Surfaces

ఎమోషనల్ సీన్స్ కారణంగా స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదిగా సాగుతుందని స్పష్టం అవుతోంది. అయినప్పటికీ సినిమా చివరి 30 నిమిషాలు వచ్చే రన్నింగ్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడతాయని సినిమాకు ఇవి పెద్ద ప్లస్ అని అంటున్నారు. మొత్తంగా చూస్తే పెద్ది సూపర్ ఫస్టాఫ్.. స్లో సెకండాఫ్ అని సమాచారం. ఇక ఫుల్ మూవీ రివ్యూ కోసం జూన్ 4 వరకూ ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+