బాబు హుందాగా చెప్పారు: చిరు

వ్యక్తిగతంగా తీసుకుని ఎవరిది పైచేయి అవుతోందనే ఆలోచనతో ముందుకు వెళ్లకూడదని, ప్రజా సమస్యలపై కలిసికట్టుగా వ్యవహరిద్దామని ఆయన సూచించారు. అభిప్రాయభేదాలు ఉండవచ్చు గానీ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వెళ్లడానికి అవి అడ్డంకి కారాదని ఆయన అన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయని, వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్తారని, అలాగే మనమూ వెళ్దామని ఆయన అన్నారు. నిన్నటి వేడి తగ్గి సభ ఆహ్లాదకరంగా మారడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈటెల రాజేందర్ (తెరాస), జి.కిషన్ రెడ్డి, జూలకంటి రంగారెడ్డి (సిపిఎం) తదితరులు మాట్లాడారు.












Click it and Unblock the Notifications