నక్సల్స్ నేత అమర్ కు బెయిల్
హైదరాబాద్: నక్సలైట్ నేత అమర్ కు గురువారం బెయిల్ మంజూరైంది. దీంతో హైదరాబాదులోని చర్లపల్లి జైలు నుంచి ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. ఆయన విడుదల కోసం ఆయన భార్య విమల, అభిమానులు, ప్రముఖ కవి కెజి సత్యమూర్తి అలియాస్ శివసాగర్ జైలు వెలుపల నిరీక్షిస్తున్నారు. సిపిఐ (ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శి అయిన అమర్ కు కరీంనగర్ జిల్లా సిరిసిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అమర్ ను అక్రమాయుధాల కేసులో పోలీసులు పూణేలో 2004 ఏప్రిల్ లో అరెస్టు చేశారు. అంతకు ముందు ఆయన ప్రభుత్వంతో నక్సలైట్లు జరిపిన చర్చల్లో పాల్గొన్నారు. అమర్ పై మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అయనపై ఇప్పటి వరకు 16 కేసులను వివిధ కోర్టులు కొట్టేశాయి. ప్రస్తుతం ఆయనపై భూ ఆక్రమణ కేసుతో పాటు అక్రమాయుధాల కేసు మాత్రమే ఉన్నాయి. ఆయన సోదరుడు, జనశక్తి అగ్రనేత రాజన్న కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విడుదలైన వెంటనే అమర్ రాజన్న వద్దకు వెళ్లనున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అమర్ తిరిగి అజ్ఝాతంలోకి వెళ్తారా, బయటే ఉండి ఉద్యమాన్ని నడిపిస్తారా అనేది ఆసక్తిగా మారింది.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications