బాబూ మారండి: నాయుడు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై మరో పార్టీ నేత లేఖాస్త్రం సంధించారు. చంద్రబాబు వైఖరిని విమర్శిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసులు నాయుడు గురువారం లేఖ రాశారు. చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలని ఆయన సూచించారు. అందరికీ ఉచిత సలహాలు ఇచ్చే చంద్రబాబు ముందు తన మైండ్ సెట్ మార్చుకోవాలని ఆయన సూచించారు. పార్టీలో ఒక్కరైనా నమ్మండని, మిమ్ముల్ని మీరైనా నమ్మండని ఆయన చంద్రబాబునుద్దేశించి అన్నారు. చంద్రబాబు ఎవరినీ నమ్మకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
చంద్రబాబు వైఖరి, పార్టీలో గత రెండు నెలలుగా జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్ర నిరాశకు గురి చేసినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు ఆలోచనా ధోరణి సవ్యంగా లేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై, ఎదురుదాడిపై ఆధారపడ్డారని, దాని వల్ల తెలుగుదేశం ఓటమి పాలైందని ఆయన అన్నారు. కొత్త పార్టీలు పుట్టుకొచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కొత్త ఆలోచనలతో, కొత్త విధానాలతో ముందుకు పోవడానికి బదులు ప్రభుత్వ వ్యతిరేకతపై మాత్రమై ఆధారపడిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications